
సినిమాలు

గత ఏడాది నుంచి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ధురంధర్ 2: ది రివెంజ్ మూవీకి ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ కొనసాగుతోంది. ఈ ఫ్రాంచైజ్ తొలి భాగం సుమారు రూ.1380 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పటికీ ఓటీటీలో కూడా ట్రెండింగ్‌లో కొనసాగింది. రెండో భాగం మే 19న ఉగాది, రంజాన్ సందర్భంగా విడుదలై ఓపెనింగ్స్‌లోనే సునామీ క్రియేట్ చేసింది.
తర్వాతి రోజుల్లో వసూళ్లు కొంచెం తగ్గినప్పటికీ మొత్తం గా సుమారు రూ.1810 కోట్ల గ్రాస్ సాధించి థియేటర్లలో ఇంకా మంచి రన్ కొనసాగిస్తోంది. ఇప్పటికీ బుక్‌మైషోలో గంటకు వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడవుతుండటం విశేషం. ఇక ఈ చిత్రం ఈ నెల 14న జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!