
సినిమాలు

ఈ వీకెండ్లో పెద్ద తెలుగు సినిమాలు రిలీజ్ కాకపోవడంతో చిన్న చిత్రాలు జెట్లీ (కమెడియన్ సత్య హీరోగా) మరియు గాయపడ్డ సింహం (తరుణ్ భాస్కర్ నటించిన చిత్రం) థియేటర్లలో విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రాలేదు. రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన ‘జెట్లీ’ కామెడీ లోపం, గందరగోళమైన కథ కారణంగా నిరాశపరిచినప్పటికీ తొలి రోజున సుమారు రూ.1.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
అదే సమయంలో ‘గాయపడ్డ సింహం’ కూడా విచిత్రమైన కథతో నెగిటివ్ టాక్ తెచ్చుకుని మొదటి రోజు సుమారు రూ.76 లక్షల వసూళ్లు సాధించింది. ఇక ఒక రోజు ముందే విడుదలైన ధనుష్ నటించిన కర మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచింది. రెండు రోజుల్లోనే సుమారు రూ.20.20 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ వీకెండ్లో టాప్‌గా నిలిచింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!