

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరతపై వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి చేపట్టిన నిరసన జంతు హింస వివాదానికి దారితీసింది. తిరుపతిలో జరిగిన ఈ నిరసనలో ఆటోను ఎడ్లబండిపై ఎక్కించి, అందులో మనుషులు కూర్చోవడంతో పాటు బండిపై కూడా మరికొందరు ఎక్కడం వల్ల ఎద్దుపై అధిక భారం పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, రాజకీయ నాయకులు, జంతు ప్రేమికులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మూగజీవాలను ఇబ్బంది పెట్టడం సరైందా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనపై ప్రముఖ యాంకర్, నటి రష్మి గౌతమ్ తీవ్రంగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ ఎద్దు పడ్డ బాధకు కారణమైన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీటా మరియు భారత జంతు సంక్షేమ బోర్డు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇటీవల హస్కీ కుక్కల హత్య ఘటనను గుర్తు చేస్తూ, మూగజీవాలపై జరుగుతున్న క్రూరత్వానికి బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!