
సినిమాలు

రాబోయే సినిమా ది రెడ్ బ్యాగ్ షూటింగ్‌ను టీం పూర్తి చేసింది. కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో, దర్శకుడు రవి కుమార్ సీరపు ఈ చిత్రాన్ని ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే విభిన్న కథతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
కాన్సెప్ట్ పోస్టర్లో చూపించిన రక్తం, ఆయుధాలు, యాక్షన్ సీన్స్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. థాయ్‌లాండ్‌లో చిత్రీకరించిన కీలక సన్నివేశాలు హైలెట్‌గా నిలవనున్నాయి. కబీర్ సింగ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనుండగా, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!