
సినిమాలు

వంద దేవుళ్ళు చిత్రంలో విజయ్ ఆంటోని మరోసారి భావోద్వేగ మాతృగీతంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతంలో ‘బిచ్చగాడు’ సినిమాలోని ‘అమ్మ’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు శశితో కలిసి రూపొందిస్తున్న ఈ చిత్రంలో ‘అమ్మా అమ్మేగా’ అనే కొత్త పాట విడుదలైంది. సినిమా టీజర్, గ్లింప్స్ ఇప్పటికే భారీ అంచనాలను పెంచాయి.
ఈ పాటలో అమ్మ గొప్పదనాన్ని హృదయాన్ని తాకేలా భాష్యశ్రీ సాహిత్యం, బాలాజీ శ్రీరామ్ సంగీతం, శ్రీకాంత్ హరిహరణ్ గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వాసిక, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల నెలలో సమ్మర్ స్పెషల్‌గా విడుదల కానుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!