

దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ తెరకెక్కించిన ‘ధ్రువనక్షత్రం’ విడుదలకు మద్రాస్ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు పదేళ్లుగా ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ పోస్టు చేశారు. తన సినిమాను ఆపేందుకు, తన కెరీర్‌ను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నించారని పేర్కొన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన తన న్యాయవాది అబ్దుల్ హమీద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ చిత్ర విడుదలకు మార్గం సుగమం చేసిన న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ రామమూర్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
విక్రమ్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 2016లో ప్రారంభమై అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఆర్థిక సమస్యలు, ఒప్పంద వివాదాల కారణంగా విడుదల ఆగిపోయింది. ఆన్ ఇన్ పిక్చర్స్ సంస్థ ఒప్పంద ఉల్లంఘన జరిగిందని కోర్టును ఆశ్రయించి విడుదలను అడ్డుకోవాలని కోరింది. అయితే తాజా తీర్పుతో ఈ చిత్రం విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఎన్నో అడ్డంకులను దాటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!