

గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా మరియు మిత్ర దేశాల సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లోని లక్ష్యాలపై భారీగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు సమాచారం. తాజాగా ఇజ్రాయెల్ మరియు అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న దాడుల్లో ఇరాన్ అధునాతన ‘సెజ్జిల్’ క్షిపణిను వినియోగించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీనిని సాధారణంగా ‘డ్యాన్సింగ్ మిసైల్’ అని కూడా పిలుస్తారు.
ఇరాన్ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ సెజ్జిల్ క్షిపణి సుమారు 2,000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. ఇది 700 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. అధిక ఎత్తులో కూడా దిశ మార్చుకుంటూ లక్ష్యాన్ని తాకే సామర్థ్యం ఉండటంతో దీనికి ‘డ్యాన్సింగ్ మిసైల్’ అనే పేరు వచ్చింది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) వివరాల ప్రకారం ఈ క్షిపణి దాదాపు 18 మీటర్ల పొడవు, 1.25 మీటర్ల వ్యాసం, సుమారు 23,600 కిలోగ్రాముల బరువు ఉంటుంది. 1990లలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కు 2008లో మొదటి పరీక్ష నిర్వహించగా, అనంతరం అనేక సార్లు పరీక్షలు నిర్వహించి దాని సామర్థ్యాన్ని మెరుగుపరిచారు.

.png&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!