

అమెరికాకు చెందిన విమానయాన సంస్థ స్పిరిట్ ఎయిర్లైన్స్ పెరుగుతున్న జెట్ ఇంధన ధరలు, ఆర్థిక సంక్షోభం కారణంగా తమ సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు ఇంధన కొరత, ఖర్చుల పెరుగుదలతో సర్వీసులను తగ్గించడం లేదా టికెట్ ధరలను పెంచుతున్న పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బుక్ చేసిన టికెట్లకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని తెలిపినప్పటికీ, ఇతర విమానయాన సంస్థల్లో బుకింగ్లకు ఎలాంటి సహాయం చేయబోమని స్పష్టం చేసింది.
34 ఏళ్లుగా తక్కువ ఛార్జీలతో ప్రయాణికులకు సేవలందిస్తున్న ఈ ఎయిర్లైన్స్ రోజుకు వందలాది విమానాలు నడిపి సుమారు 17,000 మందికి ఉపాధి కల్పించింది. కోవిడ్ తర్వాత పెరిగిన నిర్వహణ ఖర్చులు, అప్పులు, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పెరిగిన ఇంధన ధరలు ఈ సంస్థను దివాలా పరిస్థితికి నెట్టాయి. ఆగస్టు 2025 నాటికి 8.1 బిలియన్ డాలర్ల అప్పులు, 8.6 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నప్పటికీ ప్రభుత్వ సహాయం అందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మూసివేతతో వేలాది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!