

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన 61వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన సింగ్ గీతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 94 ఏళ్ల వయసులో కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆయన సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు. పుష్పక్, ఆదిత్య 369 వంటి క్లాసిక్ చిత్రాలతో భారతీయ సినిమాను కొత్త దిశలో నడిపించిన ఆయన, ఇప్పుడు దేశంలోని తొలి మ్యూజికల్ ఫాంటసీ చిత్రాన్ని తీసుకురానున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ టీజర్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచుతోంది.
ఒక రహస్య గ్రామం నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రతాప్ అనే యువకుడి జీవిత ప్రయాణాన్ని చూపిస్తుంది. నిజం, మాయ మధ్య తేడా తెలియని ప్రపంచంలోకి అడుగు పెట్టిన అతను, అభివృద్ధి-పరిరక్షణ మధ్య సంఘర్షణలో చిక్కుకుంటాడు. అయ్యాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఫాంటసీకి హాస్యాన్ని జోడిస్తూ ప్రత్యేకమైన అనుభూతిని అందించనుంది. అంకూర్ సి సినిమాటోగ్రఫీ, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం చిత్రానికి ప్రత్యేకమైన మూడ్‌ను తీసుకువస్తున్నాయి. నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 11 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!