
సినిమాలు

నరేంద్ర మోదీ సభకు ప్రతిపాదించిన “జనాగ్రహ సభ” పేరును పీఎంఓ తిరస్కరించడంతో ఆ పేరును అధికారికంగా తొలగించారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం జరుగుతున్న సభకు ‘జనాగ్రహ’ వంటి పేరు అవసరం లేదని పీఎంఓ అభిప్రాయపడినట్లు సమాచారం. కేంద్ర పార్టీ సూచనల మేరకు రాష్ట్ర బీజేపీ ఈ నిర్ణయం తీసుకుని, సభను సాధారణంగా ప్రధాని బహిరంగ సభగా నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించనున్నారు. ఈ సభను అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించే విధంగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో మరింత ఆదరణ పొందుతుందని రాష్ట్ర బీజేపీ నాయకులు భావిస్తున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!