

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి అరుదైన ఆహ్వానం లభించింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వాన లేఖ పంపించారు. ఈ కార్యక్రమం ఈ ఏడాది మార్చి 27 న హార్వర్డ్ క్యాంపస్లో జరగనుంది. భారత్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే ఈ సింపోజియానికి ఆహ్వానం అందుకోవడం విశేషంగా భావిస్తున్నారు.
మౌలిక సదుపాయంగా ఏఐ & కంప్యూట్ పవర్: జీవన ప్రమాణాలు మరియు ఉపాధిపై ప్రభావం అనే ప్యానెల్లో ప్రసంగించేందుకు సీఎంను ఆహ్వానించారు. డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ప్రభావంపై ఈ సెషన్లో చర్చ జరుగనుంది. ఏఐ ఎకోసిస్టమ్, ఏఐ సిటీ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, భూమి, విద్యుత్, నైపుణ్యాలు, నియంత్రణ, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై మాట్లాడాలని ప్రత్యేకంగా కోరారు. ఇటీవల అమెరికా పర్యటనలో నిర్వాహకులు సీఎంను కలిసి సింపోజియం వివరాలు తెలియజేశారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!