

దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరోసారి విమానాల ఆలస్యంతో విమర్శలు ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 24 న చెన్నై నుంచి సింగపూర్‌కు వెళ్లాల్సిన 6E1025 విమానం దాదాపు ఐదు గంటల పాటు ఆలస్యమైంది.
ఉదయం 7.30 గంటలకు బయలుదేరాల్సిన ఈ విమానంలో ప్రయాణికులను ముందుగానే ఎక్కించినప్పటికీ, దీర్ఘకాలం విమానం కదలలేదు. సుమారు 200 మంది ప్రయాణికులు విమానంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. క్యాబిన్లో ఉష్ణోగ్రత సమస్య కారణంగా ఇంజిన్ ప్రారంభించలేదని సంస్థ వెల్లడించింది.
ప్రయాణికులు సరైన సమాచారం ఇవ్వలేదని, ఎయిర్ కండిషనింగ్ పదేపదే ఆన్, ఆఫ్ చేయడం వల్ల ఇబ్బందులు పడ్డామని ఆరోపించారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఇటీవల డైరెక్టరేట్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ అమలు చేస్తున్న ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనల నేపథ్యంలో సిబ్బంది కొరత సమస్యలు పెరిగినట్లు విమానయాన రంగ వర్గాలు పేర్కొంటున్నాయి.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!