

భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశ పూర్తయ్యిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఒప్పందంపై సంతకాలు జరిగి, సంయుక్త ప్రకటన విడుదల కానుందని తెలిపారు. ఆ తర్వాత వెంటనే భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాల్లో తగ్గింపు అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. పూర్తిస్థాయి చట్టబద్ధ ఒప్పందం మార్చి మధ్య నాటికి ఖరారయ్యే అవకాశముందని, ఆ తర్వాత అమెరికా ఉత్పత్తులపై భారత్లో సుంకాల తగ్గింపు అమలవుతుందని చెప్పారు.
అమెరికా నుంచి రూ.45 లక్షల కోట్ల దిగుమతుల అంశంపై స్పందించిన పీయూష్ గోయల్. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్కు చమురు, విమానాలు, డేటా సెంటర్లు, సాంకేతిక పరికరాలు అవసరమని స్పష్టం చేశారు. విమానాలు, ఇంజన్లు, విడిభాగాల కొనుగోళ్లు, డేటా సెంటర్ల పెట్టుబడులను కలిపితే ఈ దిగుమతుల విలువ పెద్దది కాదన్నారు. దేశ ఇంధన భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యమని, అవసరాన్ని బట్టి వెనెజువెలా సహా ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని విదేశాంగ శాఖ వెల్లడించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!