
టెక్నాలజీ

భారత్లో తొలి బుల్లెట్ రైలు సేవల పై ఉత్కంఠకు తెరలేపుతుంది. దేశంలో మొదటి బుల్లెట్ రైలు 2027 ఆగస్టులో అధికారికంగా ప్రారంభం కానుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రాజెక్టు తొలి దశలో గుజరాత్లోని సూరత్–వాపి మధ్య 100 కిలోమీటర్ల పొడవులో రైలు నడపాలని ప్రభుత్వం అనుకుంటుంది . మొత్తం ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టు 2029 నాటికి పూర్తవుతుందని మంత్రి తెలిపారు.
ఈ కారిడార్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగానే ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణం కేవలం 2 గంటల్లోనే ముగిసిపోతుందని ఆయన చెప్పారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన అనంతరం అశ్వినీ వైష్ణవ్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!