

వాయు కాలుష్యం భారత్‌ను తీవ్రంగా వణికిస్తోంది. స్వచ్ఛమైన గాలి పీల్చలేని పరిస్థితులు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని వందలాది నగరాలు తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. దేశంలోని దాదాపు 44 శాతం నగరాలు దీర్ఘకాలిక వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) విడుదల చేసిన నివేదిక ప్రకారం, శాటిలైట్ డేటా ఆధారంగా దేశంలోని 4,041 నగరాల్లో పీఎం2.5 స్థాయిలను విశ్లేషించారు. 2014 నుంచి 2024 వరకు, కోవిడ్ ప్రభావిత 2020 సంవత్సరాన్ని మినహాయించి, 1,787 నగరాలు జాతీయ వార్షిక పీఎం2.5 ప్రమాణాన్ని మించాయని నివేదిక పేర్కొంది. 2025 అంచనాల ప్రకారం అస్సాంలోని బన్రీహాట్, ఢిల్లీ, యూపీలోని ఘజియాబాద్ దేశంలో అత్యంత కాలుష్యపూరిత నగరాలుగా ఉన్నాయి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ పరిధిలో కేవలం 4 శాతం నగరాలే ఉండగా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అత్యధికంగా గాలి నాణ్యత ప్రమాణాలను చేరుకోలేని నగరాలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!