

భారత్ ప్రతిష్టాత్మక మానవ అంతరిక్ష యాత్ర ప్రోగ్రామ్ ‘గగనయాన్’లో మరో కీలక ముందడుగు పడింది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) చండీగఢ్‌లో డ్రోగ్ ప్యారాచూట్‌కు సంబంధించిన క్వాలిఫికేషన్ స్థాయి లోడ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, ఈ పరీక్షలో వాస్తవ ప్రయాణ సమయంలో ఎదురయ్యే గరిష్ట ఒత్తిడికంటే ఎక్కువ లోడును అనుకరించి పరీక్షించడంతో డిజైన్ భద్రత మరింత బలపడినట్లు నిరూపితమైంది.
ఈ పరీక్షను ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ADRDE) మరియు టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (TBRL) బృందాల సమన్వయంతో నిర్వహించారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారత్ అంతరిక్ష మిషన్ల కోసం అధిక బలం కలిగిన రిబ్బన్ ప్యారాచూట్ల రూపకల్పన, తయారీలో దేశ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇది భారత మానవ అంతరిక్ష యాత్ర లక్ష్యానికి మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!