

జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లా చక్రధర్పూర్ రైల్వే డివిజనల్ ఆసుపత్రి చరిత్ర సృష్టించింది. తొలిసారిగా ఒకే రోజు పుట్టిన శిశువులకు ఆధార్ నమోదు చేసి, జనన సర్టిఫికేట్లు జారీ చేసింది. శనివారం ఆ ఆసుపత్రిలో జన్మించిన నలుగురు శిశువులకు ఆధార్ నమోదు పూర్తిచేసి, అదే రోజున జనన ధృవపత్రాలు ఇచ్చినట్లు సౌత్ ఈస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే పరిధిలోని ఏ ఆసుపత్రిలోనూ ఇదే మొదటి ఉదాహరణగా గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమం చక్రధర్పూర్ రైల్వే విభాగం, జిల్లా పరిపాలన, పోస్టల్ శాఖ మరియు ఆదార్ విభాగం కలిసి సమన్వయంతో చేపట్టినదని అధికారులు తెలిపారు. దీంతో పుట్టిన కొత్త శిశువుల గుర్తింపు పత్రాల ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా పూర్తవుతోంది.
భవిష్యత్తులో కూడా ఈ శాఖల అధికారులు రెగ్యులర్‌గా రైల్వే ఆసుపత్రిని సందర్శించి, కొత్తగా పుట్టిన శిశువులకు అక్కడికక్కడే ఆధార్ నమోదు, జనన సర్టిఫికేట్ జారీ చేసే విధానాన్ని కొనసాగిస్తారని తెలిపారు. ఈ చర్యతో తల్లిదండ్రులకు సమయం ఆదా అవుతుందని, ప్రభుత్వ సేవల ప్రాప్యత మరింత సులభం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!