

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ – పాక్ యుద్ధం గురించి వ్యాఖ్యానించారు. గాజా శాంతి మండలి సమావేశంలో మాట్లాడుతూ, ఆ యుద్ధాన్ని తానే ఆపానని అన్నారు. ఈ ఘర్షణల్లో 11 ఖరీదైన యుద్ధ విమానాలు కూలిపోయాయని కూడా పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందాలు లేకపోతే ఆర్థిక నష్టం జరుగుతుందని ఇరు దేశాలు యుద్ధం వద్దని నిర్ణయించుకున్నాయని ట్రంప్ చెప్పారు.
భారత్ – పాక్ మధ్య రాజీకి తానే కారణమని ట్రంప్ ఇప్పటికే 80 సార్లకు పైగా వివిధ వేదికల్లో చెప్పినట్లు సమాచారం. అయితే, ట్రంప్ చేసిన ప్రతి ప్రకటనను భారత్ ఖండిస్తూ వస్తోంది. పాక్తో సంబంధాల్లో మూడో దేశం జోక్యాన్ని అంగీకరించబోమని భారత్ పలుమార్లు స్పష్టం చేసింది.
రాజీకి తానే కారణమని మొదటిసారి చెప్పినప్పుడు ట్రంప్ 5 ఫైటర్ జెట్స్ కూలిపోయాయని అన్నారు. కొద్ది నెలల తరువాత ఆ సంఖ్యను 7 గా పేర్కొన్నారు. తాజాగా 11 జెట్స్ కూలిపోయాయని చెప్పడం చర్చకు దారితీసింది. అయినప్పటికీ, యుద్ధం ఆగడానికి తన పాత్రే కీలకమని ట్రంప్ తరచూ చెబుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!