
సినిమాలు

హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతంలో రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRA) అధికారులు కాపాడారు. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి మదీనగూడ వెళ్లే మార్గంలో ఉన్న జంగమోని కుంటకు సంబంధించిన సుమారు నాలుగు ఎకరాల భూమిని కొంతమంది కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. మట్టిపోసి ప్లాట్లుగా మార్చి అమ్మకానికి సిద్ధం చేస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేశారు.
ఫిర్యాదులు అందిన వెంటనే హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ ఆక్రమణలను అడ్డుకునే చర్యల్లో భాగంగా కుంట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే ప్రక్రియను చేపట్టారు. ప్రభుత్వ భూములు, జలవనరులను కాపాడడమే లక్ష్యంగా ఇలాంటి ఆపరేషన్లు కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!