

దేశంలోని దిల్లీ, ముంబయి, కోల్కతా వంటి మెట్రో నగరాలతో పోలిస్తే గాలి నాణ్యత కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక వాయుకాలుష్యం హైదరాబాద్లోనే నమోదవుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) వెల్లడించింది. హైదరాబాద్లో గురువారం నిర్వహించిన ‘ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ – ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్’ సదస్సులో ఈ గణాంకాలను అధికారులు ప్రకటించారు. గతంతో పోలిస్తే కాలుష్యం స్వల్పంగా తగ్గినప్పటికీ, డబ్ల్యూహెచ్ఓ మరియు సీపీసీబీ ప్రమాణాలకు మించి ఉన్నట్లు తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో పీఎం-10 స్థాయి 40 మైక్రోగ్రాములు మించకూడదని సూచించగా, హైదరాబాద్లో ఇది 82 నుంచి 88 ఎంజీల వరకు నమోదవుతోంది. సీపీసీబీ పరిమితి అయిన 60 ఎంజీలతో పోల్చినా సుమారు 35 శాతం అధికంగా ఉందని పీసీబీ స్పష్టం చేసింది. ఈ జనవరిలో నగరంలో పీఎం-10 కనిష్ఠంగా 80 ఎంజీ, గరిష్ఠంగా 105 ఎంజీగా నమోదైంది. ఐఐటీ కాన్పూర్ అధ్యయనం ఆధారంగా హైదరాబాద్లో ఏడు కాలుష్య హాట్స్పాట్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ కారిడార్లు కాలుష్య కేంద్రాలుగా మారగా, గత ఏడాదిలో ఒక్కరోజు కూడా ‘స్వచ్ఛమైన గాలి’ ఏక్యూఐ స్థాయిని హైదరాబాద్ నమోదు చేయలేదని నివేదిక వెల్లడించింది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!