

దేశంలో భారీ విధ్వంసానికి ప్రణాళికలు రచించిన అంతర్జాతీయ ఉగ్ర ముఠా కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. భారత గడ్డ పై మరోసారి రక్తపాతం సృష్టించాలని యత్నించిన ఈ కుట్రను భద్రతా దళాలు సమయానికి గుర్తించి చర్యలు చేపట్టాయి.
పాకిస్తాన్‌కు చెందిన గూఢచారి సంస్థ ఐఎస్ఐతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన తీవ్రవాద సంస్థల మద్దతుతో ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగించినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. దేశంలో పలు ప్రాంతాల్లో విధ్వంసక చర్యలకు సిద్ధమవుతున్న సమయంలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకకాలంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో ఆరుగురిని తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో అరెస్ట్ చేయగా, మరో ఇద్దరిని పశ్చిమ బెంగాల్లో పోలీసులు పట్టుకున్నారు.
అరెస్ట్ చేసిన నిందితుల నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశ భద్రతకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!