

ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్) కింద రూ.41,863 కోట్ల పెట్టుబడితో కూడిన 22 కొత్త ప్రతిపాదనలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్–ఐటీ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు రూ.2.58 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవుతాయని, దాదాపు 33,800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కలుగుతాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఇంతకుముందు ఈ పథకం కింద రూ.12,704 కోట్ల పెట్టుబడితో 24 ప్రతిపాదనలకు అనుమతులు ఇచ్చారు. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే కీలక ఎలక్ట్రానిక్స్ విడిభాగాల కోసం విదేశాల పై ఆధారపడటం గణనీయంగా తగ్గనుంది.
యాపిల్ సంస్థ చైనా వెలుపల తయారీ విస్తరణ పై దృష్టి పెట్టిన నేపథ్యంలో, దానికి విడిభాగాలు సరఫరా చేసే అనేక కొత్త కంపెనీలు దరఖాస్తు చేశాయి. టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్, డిక్సన్, హిందాల్కో, మదర్సన్, శామ్సంగ్ డిస్ప్లే నోయిడా వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి.
మొబైల్ తయారీ విడిభాగాలకు రూ.27,166 కోట్లు, పీసీబీ విభాగానికి రూ.7,377 కోట్లు, లిథియం అయాన్ సెల్ల తయారీకి రూ.2,922 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు రావడం విశేషం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!