

యాదగిరిగుట్టలో బుధవారం రాత్రి శుభసింహలగ్నంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరు కళ్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, భూదాన్‌పోచంపల్లి చేనేత కార్మికులు, భువనగిరి స్వర్ణగిరి ఆలయం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఈ కానుకలను సమర్పించారు.
గజవాహనంపై నారసింహస్వామి, పల్లకిపై అమ్మవారు లక్ష్మీదేవి తిరువీధి మండపానికి చేరుకోగా పూజారులు పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం మహా కళ్యాణం తతంగాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు విశ్వక్సేన ఆరాధనతో కల్యాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి దంపతులు, ఈవో భవానీశంకర్ ఆలయ పక్షాన పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మాంగల్యధారణతో మహోత్సవం ముగియగా, ఈ దివ్య కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
_1771477764226.jpg&w=3840&q=75)







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!