
.webp&w=3840&q=75)
మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) 2026–2027 సంవత్సరానికి సంబంధించిన డైరీ, ఇన్సూరెన్స్ రెన్యువల్ మరియు ఐడి కార్డులను ఘనంగా ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరాది సందర్భంగా జర్నలిస్టుల కోసం డైరీ విడుదల చేయడం, ఇన్సూరెన్స్ ప్లాన్ను పునరుద్ధరించడం TFJA ఆనవాయితీగా కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని వేడుకను మరింత ప్రత్యేకంగా చేశారు.
ఈ ఏడాది జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక మార్పులు చేపట్టారు. ప్రతి ఫిల్మ్ జర్నలిస్ట్ కుటుంబానికి (2+2) అందించే ఇన్సూరెన్స్ కవరేజీని ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచారు. అదనంగా, ప్రమాదాల సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక యాక్సిడెంట్ పాలసీని ప్రవేశపెట్టారు. ఈ పాలసీ ప్రకారం, ప్రమాదం కారణంగా 2 నుంచి 12 నెలల వరకు బెడ్ రెస్ట్ అవసరమైన పరిస్థితుల్లో ప్రతి వారం ₹10,000 చొప్పున ఆర్థిక సహాయం అందేలా ఏర్పాటు చేశారు.
అలాగే, తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులకు గుర్తింపునిచ్చే ఉద్దేశంతో ఐడి కార్డులను జారీ చేసి, వాటిని చిరంజీవి గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా TFJA చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ, సభ్యుల సంక్షేమం కోసం వినియోగించాలనే ఉద్దేశంతో చిరంజీవి గారు ₹5 లక్షల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో TFJA ప్రెసిడెంట్ వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర, పాలిటి బ్యూరో కన్వీనర్ వారణాసి లక్ష్మీనారాయణతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!