
టెక్నాలజీ

వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు పంపించింది. సంస్థపై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ హెరిటేజ్ తరపున న్యాయవాది జి. మల్లిఖార్జున్‌రావు ఈ నోటీసులు జారీ చేశారు. తప్పుడు ప్రచారం చేసిన అంశాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని నోటీసులో కోరారు.
దశాబ్దాలుగా అత్యున్నత ప్రమాణాలతో కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నామని హెరిటేజ్ సంస్థ పేర్కొంది. పారదర్శక విధానాలతో సంస్థ చట్టబద్ధంగా పనిచేస్తోందని, జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో పలు గుర్తింపులు పొందిందని నోటీసులో వెల్లడించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!