

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఉప ఫ్లోర్ లీడర్ టి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోకాపేట్ నియోపోలిస్ ప్రాంతంలో ఉన్న విశాఖ శారద పీఠం మరియు రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. దేవాలయాలు, మఠాల కూల్చివేతకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన విమర్శించారు.
2019 లో కేసీఆర్ ప్రభుత్వ కాలంలో చట్టబద్ధంగా రెండు ఎకరాల భూమిని శారద పీఠానికి కేటాయించామని హరీష్ రావు తెలిపారు. పీఠం నిర్వాహకులు ప్రభుత్వానికి చెల్లింపులు చేసి నమోదు ప్రక్రియ పూర్తి చేసి, అనుమతులు పొందిన తర్వాత ఆలయం, గోశాల, నిత్య అన్నదాన సత్రం, వేద పాఠశాల నిర్మించారని చెప్పారు. ఈ భూమిని కాపాడుకోవడం తమ బాధ్యత అని, రాజశ్యామల ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చనివ్వమని ఆయన స్పష్టం చేశారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!