

నటుడు శర్వానంద్ తన తాజా చిత్రం ‘బైకర్’ కోసం చాలా పెద్ద మార్పు చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మోటో స్పోర్ట్స్ యాక్షన్ సినిమా లో మాళవిక నాయర్ హీరోయిన్‌గా, రాజశేఖర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా కోసం శర్వానంద్ శారీరకంగా, మానసికంగా తనను తాను పూర్తిగా మార్చుకున్నారని చెప్పారు. జీవితంలో కష్టమైన సమయంలో ఈ సినిమా తనకు కొత్త ఆరంభంగా మారిందని తెలిపారు.
గత రెండు సంవత్సరాలుగా ఆయన ఉదయం త్వరగా లేచి వ్యాయామం, యోగా, ప్రాణాయామం, ట్రైనింగ్ చేస్తూ వచ్చారు. రోజుకు 32 కిలోమీటర్ల వరకు నడక, పరిగెత్తడం చేసి 6 నుంచి 7 కిలోల వరకు బరువు తగ్గారు. ముఖ్యంగా యోగా తన ఆలోచనా విధానాన్ని మార్చిందని, ప్రశాంతంగా ఉండడం నేర్పిందని చెప్పారు. ఈ మార్పు కేవలం శరీరానికే కాకుండా మనసుకూ సంబంధించినదని, తాను సాధించగలిగితే ప్రతి ఒక్కరూ సాధించవచ్చని శర్వానంద్ తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!