
టెక్నాలజీ

రైతులకు ఈ రోజు నిజమైన గుడ్ న్యూస్ రానుంది. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకంలో భాగంగా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు రెండో విడత సాయం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది.
మొత్తం 46,85,838 మంది రైతులకు రూ.7,000 చొప్పున, మొత్తం రూ.3,135 కోట్లు ఈరోజే విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కడప జిల్లా పెండ్లిమర్రిలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు ఈ నిధులను జమ చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇక ఏపీతో పాటు తెలంగాణ సహా దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులకు కూడా శుభవార్తే. పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో సాయం జమ చేయనున్నారు. దీంతో ఒకే రోజున రెండు కీలక పథకాల నిధులు రైతులకు చేరడం మరింత ఉపయోగకరంగా మారనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!