
క్రీడలు

కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ప్రధాని పొదుపు చర్యలపై ప్రజలకు సూచనలు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంధన వినియోగంపై కొన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లో నెలకొన్న అస్థిరతల కారణంగా భారత్‌పై ప్రభావం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పెట్రో ధరలు, వినియోగ నియంత్రణపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!