
జనరల్

టాటా సన్స్ షేర్ల బదిలీ వ్యవహారంపై రతన్ టాటా ట్రస్టు ట్రస్టీలకు న్యాయ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసులో నోయెల్ టాటా, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పేర్లు కూడా ఉన్నాయి. నవాజ్‌బాయి రతన్ టాటా ట్రస్టుకు చెందిన 833 ఈక్విటీ షేర్లు సరైన అనుమతులు, సముచిత ప్రతిఫలం, చట్టబద్ధ పత్రాలు లేకుండా నవల్ హెచ్. టాటాకు వ్యక్తిగతంగా బదిలీ చేశారని ఆరోపించారు.
ఈ నోటీసును సునీల్ తులసీరామ్ పాటిల్ఖేడే తరఫున న్యాయవాది కాత్యాయనీ అగ్రవాల్ జారీ చేశారు. ఇదే వ్యక్తి ఈ నెల 8న జరిగిన సర్ రతన్ టాటా ట్రస్టు, దొరాబ్జీ టాటా ట్రస్టు సమావేశాలను నిలిపివేయాలని బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆ సమావేశాలపై నిలుపుదల ఇవ్వడానికి నిరాకరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!