
క్రీడలు

నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ లీక్ ప్రింటింగ్ ప్రెస్ దశలోనే జరిగి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సమాచారం ప్రకారం ప్రశ్నాపత్రాలు నాసిక్ నుంచి జైపూర్‌కు, అక్కడి నుంచి రాజస్థాన్‌లోని సికార్‌కు తరలించబడ్డాయి. ప్రశ్నాపత్రాల రవాణా మార్గం మరియు లీక్ వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై అధికారులు లోతుగా విచారణ చేపట్టారు.
లీకైన నీట్ ప్రశ్నాపత్రాలు ఢిల్లీ, జమ్మూకశ్మీర్, బిహార్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చేరినట్లు సమాచారం. సికార్‌లోని ఓ హాస్టల్ నిర్వాహకుడు అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల్లో ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!