
క్రీడలు

నటుడు-రాజకీయ నాయకుడు విజయ్‌కు నేడు తమిళనాడు శాసనసభలో కీలక బలపరీక్ష ఎదురుకానుంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించాయి. దీంతో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు అసెంబ్లీలో బలం పెరిగింది.
అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 234 కాగా, నేటి సమావేశానికి 232 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉంది. మెజారిటీ నిరూపించుకోవడానికి టీవీకేకు 117 మంది మద్దతు అవసరం. ప్రస్తుతం టీవీకేకు 106 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, కాంగ్రెస్-5, వామపక్షాలు-4, ఐయూఎంఎల్-2, వీసీకే-2 సభ్యుల మద్దతు లభిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!