
క్రీడలు

ఈ వారాంతంలోగా నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రుతుపవనాల ఆగమనానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని, మరో పది రోజుల్లో కేరళకు రుతుపవనాలు చేరవచ్చని అధికారులు వెల్లడించారు.
మరోవైపు కొనసాగుతున్న అల్పపీడనం మరికొన్ని గంటల్లో బలపడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీని ప్రభావంతో అల్లూరి, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!