
2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీహెచ్ఎంసీ బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించింది. మొత్తం రూ.11,460 కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వివిధ వనరుల ద్వారా జీహెచ్ఎంసీకి రూ.6,441 కోట్ల ఆదాయం లభించినట్లు వెల్లడించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ ఖర్చులు రూ.4,057 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో రూ.2,384 కోట్ల రెవెన్యూ మిగులు ఏర్పడింది. అలాగే రెవెన్యూ గ్రాంట్ల రూపంలో రూ.400 కోట్లు జీహెచ్ఎంసీకి అందాయి.
కొత్తగా జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.2,260 కోట్లు కేటాయించారు. విలీనమైన 27 మున్సిపాలిటీల నుంచి మొత్తం రూ.1,860 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు అధికారులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!