
న్యూస్

గ్యాస్ కొరత కారణంగా ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీని తాత్కాలికంగా నిలిపివేశారు. గత మూడు సంవత్సరాలుగా భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందజేస్తూ వస్తున్న ఆలయం, మురుకులు, అతిరసలు వంటి పదార్థాలను కూడా తయారు చేసి విక్రయిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే భక్తుల నుంచి భారీ డిమాండ్ రావడంతో, ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిపై లడ్డూలు తయారు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరినట్లు తెలిపారు. అనుమతి వచ్చిన వెంటనే కట్టెల పొయ్యులపై లడ్డూల తయారీని పునఃప్రారంభించి భక్తులకు ప్రసాదం అందించనున్నారు.










.webp&w=3840&q=75)
.avif&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!