
జనరల్

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రతి సంవత్సరం మే 10వ తేదీని “మార్కా-ఎ-హక్” దినంగా నిర్వహిస్తామని ప్రకటించారు. గత ఏడాది భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిస్పందనగా పాకిస్థాన్ తన చర్యలను “మార్కా-ఎ-హక్”గా పేర్కొంది. ఈ ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గత సంవత్సరం పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు మరణించగా, దానికి ప్రతిగా భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరిగాయి. చివరికి సైనిక చర్చల ద్వారా కాల్పుల విరమణకు అంగీకరించారని షెహబాజ్ తెలిపారు. ఈ ప్రక్రియలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్రను ఆయన ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!