

కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. హైదరాబాద్ లో సుమారు 1,000 బస్సులను అద్దె, ఔట్‌సోర్సింగ్ విధానంలో నడపనున్నారు. వీటిలో 480 ఎలక్ట్రిక్ బస్సులు, 250 అద్దె బస్సులు, 270 ఇతర బస్సులు ఉండనున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుండటంతో, నగరంలో రవాణా సేవలను కొనసాగించడం సవాల్‌గా మారింది. రోజుకు 26 లక్షల మంది ప్రయాణించే పరిస్థితుల్లో ఈ పరిమిత బస్సులతో అవసరాలను తీర్చడం కష్టతరమని అధికారులు భావిస్తున్నారు.
కనీసం 2,000 బస్సులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ట్రిప్పుల సంఖ్య పెంచినా రద్దీ నియంత్రణ కష్టమవుతుంది. దీంతో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని వినియోగించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు ఎంఎంటీఎస్, మెట్రో సేవలపై అదనపు భారం పడనుంది. ఫలక్‌నుమా, లింగంపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి మార్గాల్లో రైలు సర్వీసులు పెంచితే ప్రయాణం సులభమవుతుంది. ముఖ్యంగా ఉదయం 8–11 గంటలు, సాయంత్రం 5–9 గంటల మధ్య రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎల్బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్, ఐటీ కారిడార్ వంటి మార్గాల్లో ప్రత్యేక దృష్టి అవసరం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!