.jpg&w=3840&q=75)

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళల జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో కోల్పోయింది. జట్టు పరాజయం పాలైనప్పటికీ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యక్తిగతంగా అరుదైన ఘనత సాధించింది. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా ఆమె ప్రపంచ రికార్డు సృష్టించింది.
ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి అత్తపత్తు (3,016 పరుగులు) పేరిట ఉండేది. అయితే మూడో టీ20 మ్యాచ్‌లో ఆ మార్క్‌ను అధిగమించిన హర్మన్‌ప్రీత్ కౌర్, ప్రస్తుతం 3,017 పరుగులతో అగ్రస్థానంలో నిలిచింది. జోహన్నెస్‌బర్గ్ మ్యాచ్‌లో ఆమె అద్భుతంగా ఆడి 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి భారత జట్టుకు టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ 2,619 పరుగులతో మూడో స్థానంలో ఉంది. ఆమె తర్వాత షార్లెట్ ఎడ్వర్డ్స్ (2,529), సూజీ బేట్స్ (2,236) స్థానాల్లో కొనసాగుతున్నారు.




.jpg&w=3840&q=75)





.jpg&w=3840&q=75)


4225-1768468351.png&w=3840&q=75)


_0.jpg.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!