.jpg&w=3840&q=75)
రాజకీయాలు

భారత్ వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ మహిళల ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ వైదొలిగింది. పాకిస్థాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి భారత్–పాకిస్థాన్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలే కారణమని తెలిపింది. గతంలో కూడా భారత్‌లో జరిగే పలు క్రీడా టోర్నీలను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ లేకుండా ఈ టోర్నీని ఇప్పుడు ఆరు జట్లతో నిర్వహించనున్నారు. వచ్చే నెల 25 నుంచి జూన్ 6 వరకు గోవాలోని మార్గావ్‌లో ఈ పోటీలు జరుగనున్నాయి. గ్రూప్-ఏలో నేపాల్, శ్రీలంక, భూటాన్ ఉండగా, గ్రూప్-బిలో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బంగ్లాదేశ్ బరిలోకి దిగుతోంది. కాగా ఈ టోర్నీలో భారత్ ఐదు సార్లు విజేతగా నిలిచి బలమైన జట్టుగా కొనసాగుతోంది.










.jpg&w=3840&q=75)


4225-1768468351.png&w=3840&q=75)


_0.jpg.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!