

రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు భారీ స్పందన లభించింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలోని మొత్తం 2,996 వార్డులకు గాను నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు దాఖలు చేయగా, ఒక్కో వార్డుకు సగటున 9 నుంచి 10 మంది పోటీ పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. చివరి రోజు మాత్రమే 13,815 మంది అభ్యర్థుల నుంచి 20,460 నామినేషన్లు స్వీకరించడం విశేషం.
పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ నుంచి అత్యధికంగా 10,046 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి 7,564, బీజేపీ నుంచి 5,462 నామినేషన్లు వచ్చాయి. జనసేన పార్టీ తరఫున 342, టీడీపీ నుంచి 32 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్సీపీ నుంచి ఒక్క నామినేషన్ మాత్రమే రాగా, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై పోటీకి ఉత్సాహం చూపించింది. వామపక్షాల్లో సీపీఐ నుంచి 260, సీపీఐ(ఎం) నుంచి 277 నామినేషన్లు వచ్చాయి. ఎంఐఎం నుంచి 576, బీఎస్పీ నుంచి 324, ఆప్ నుంచి 51 నామినేషన్లు నమోదయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే నెల 3 వరకు అవకాశం ఉండగా, పోలింగ్ వచ్చే నెల 11న జరగనుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!