
జనరల్

తెలంగాణ ఈగల్ (EAGLE) పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టైంది. థాయ్‌లాండ్ నుంచి భారతదేశానికి అక్రమంగా తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని గుర్తించిన అధికారులు భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.12 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా ముఠా కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన ఓ విదేశీ మహిళతో పాటు మొత్తం 10 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నెట్‌వర్క్‌పై మరింత లోతుగా విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!