
జనరల్

తెలంగాణలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో పలు విద్యాసంస్థలకు వేసవి సెలవులను పొడిగిస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ, పీజీ కళాశాలలకు ఈ నెల 6 వరకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం, తాజాగా అంగన్‌వాడీ కేంద్రాల సెలవుల పొడిగింపుపైనా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాలకు మే 1 నుంచి ఈ నెల 1 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతుండటంతో చిన్నారులను కేంద్రాలకు తీసుకురావడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సెలవులను ఈ నెల 10 లేదా 15 వరకు పొడిగించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!