

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం విషయంలో ఎలాంటి లోటు ఉండనివ్వమని స్పష్టం చేశారు. “రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు” అని పేర్కొంటూ నంగునూరు మండలం నర్మెట్టలో జరిగిన రైతు ఉత్సవాల్లో పాల్గొన్నారు. రైతు భరోసా పథకం కింద 45 రోజుల్లో మూడు విడతలుగా ₹9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రతీ నెల ₹5,500 కోట్లకు పైగా రైతు సంక్షేమానికి ఖర్చు చేస్తోందని, రాష్ట్రం వరి ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ సీజన్‌లో 71 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించడం అవసరమని, ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటలను ప్రోత్సహిస్తామని సీఎం తెలిపారు. మహిళా సాధికారతపై కూడా దృష్టి సారిస్తూ, బ్యాంక్ లింకేజీల ద్వారా ₹57 వేల కోట్ల రుణాలు అందించినట్లు చెప్పారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం, సోలార్ ప్రాజెక్టుల ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరుస్తున్నామని పేర్కొన్నారు. ఎరువుల కొరత వంటి సమస్యలపై కేంద్రంతో సమన్వయం అవసరమని, రాజకీయాల కంటే అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.

.jpg&w=3840&q=75)







.webp&w=3840&q=75)










.webp&w=3840&q=75)
.avif&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!