
గాసిప్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతీయ రైల్వేలు విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటవడం రాష్ట్ర ప్రజల దీర్ఘకాల స్వప్నం నెరవేరిందని తెలిపారు. ఈ జోన్ అధికారిక కార్యకలాపాలు 2026 జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి.
వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస–ఇచ్చాపురం వంటి కీలక మార్గాలను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగాన్ని మారుస్తుందని చెప్పారు. విశాఖ, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయం పెరిగి రైల్వే వ్యవస్థ బలోపేతం అవుతుందని, ఇది పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి నరేంద్ర మోదీ మరియు అశ్వినీ వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!