
క్రీడలు

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు త్వరగా ఆమోదం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కోరారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఫేజ్-2 కోసం ఇప్పటికే సమగ్ర డీపీఆర్‌ను సమర్పించినట్లు సీఎం తెలిపారు.
హైదరాబాద్ నగర అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మెట్రో విస్తరణ అవసరమని సీఎం పేర్కొన్నారు. ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ద్వారా ఫేజ్-2, ఫేజ్-3 పనులు సులభతరం అవుతాయని వివరించారు. జాయింట్ వెంచర్‌గా ప్రాజెక్ట్‌ను త్వరగా ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!