
గాసిప్స్

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మే 10న జరగనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో ప్రధానమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు బహిరంగ సభలో పాల్గొననున్నారు. భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్త్ ఏర్పాట్లను బ్లూ బుక్ ప్రకారం అమలు చేయాలని సూచించారు. బేగంపేట్ విమానాశ్రయం, హెలిప్యాడ్లు, సమావేశ వేదికల వద్ద అగ్నిమాపక, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని, కాన్వాయ్ మార్గాల్లో రోడ్లను పరిశీలించి మరమ్మత్తులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!