
గాసిప్స్

మాసాబ్‌ట్యాంక్ ప్రాంతంలో వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ప్రముఖ నటి సోదరుడు అమన్‌ప్రీత్ పేరు బయటకు వచ్చింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ఈగల్ టీమ్‌తో పాటు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ కేసులో ట్రూప్ బజార్‌కు చెందిన వ్యాపారులు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి అరెస్టయ్యారు. విచారణలో భాగంగా, ఈ ఇద్దరి వద్ద నుంచి అమన్‌ప్రీత్ మాదకద్రవ్యాలు కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. వారి నుంచి మొత్తం 43 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
గమనార్హమైన విషయం ఏమిటంటే, గత ఏడాది కూడా అమన్‌ప్రీత్ సైబరాబాద్ పోలీసుల చేతుల్లో చిక్కినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడి పాత్ర పై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!