
ఓటిటి

వైఎస్సార్సీపీ నేతలు వేమూరి రాధాకృష్ణ రాసిన వ్యాసాలపై తీవ్రంగా స్పందిస్తూ నిరసనలు చేపట్టారు. ఈ నిరసన హైదరాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, లక్ష్మీ పార్వతి, విశ్వరూప్, శ్రీకాంత్ రెడ్డి, మార్గాని భరత్ తదితరులు పాల్గొన్నారు.
ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు జర్నలిజం విలువలను దెబ్బతీసేలా ఉన్నాయని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. మహిళలను అవమానించేలా ఉన్న వ్యాఖ్యలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి రాతలకు తాము భయపడబోమని స్పష్టం చేస్తూ, మీడియా నైతిక విలువలు కాపాడాలని కోరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!