

వన్‌ప్లస్ నార్డ్ 6 ఈరోజు భారత్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ తన సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఫీచర్లను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 9000mAh భారీ బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే, శక్తివంతమైన కెమెరా సామర్థ్యాలతో ఇది రానుంది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 50MP సోనీ మెయిన్ కెమెరా, 1.5K AMOLED స్క్రీన్ ఉండనుంది. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్, ఫ్రీ ఫైర్ వంటి గేమ్స్‌లో 165 FPS గేమింగ్‌ను సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ లాంచ్ ఈవెంట్ ఏప్రిల్ 7 సాయంత్రం 7 గంటలకు యూట్యూబ్‌లో ప్రసారం కానుంది. విక్రయాలు ఈ నెల 9 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతాయి.
ఈ ఫోన్‌లో గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి టచ్ రిఫ్లెక్స్ చిప్, 6 యాక్సిస్ జైరోస్కోప్, స్పేషియల్ ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఉన్న అమోలెడ్ డిస్‌ప్లే కళ్లకు అనుకూలంగా ఉంటుంది. 80W ఫాస్ట్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఏఐ ఆధారిత కెమెరా టూల్స్‌తో ఫోటోలను సులభంగా మెరుగుపరచుకోవచ్చు. అదనంగా ప్లస్ కీ, గూగుల్ జెమిని వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ ధర రూ.35,000 నుంచి రూ.40,000 మధ్య ఉండే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!