
న్యూస్

మేడారం సమ్మక్క–సారక్క జాతర విజయవంతంగా ముగిసిందని మంత్రి సీతక్క తెలిపారు. జాతర ఏర్పాట్లు, గుడి పనులు పూర్తిగా సజావుగా జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. ఒక చిన్న దొంగతనం ఘటనను కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని మంత్రి ఆరోపించారు.
ఈ జాతరకు క్లాస్, మాస్‌తో పాటు హైక్లాస్ ప్రజలు కూడా భారీగా హాజరై అమ్మవార్లను దర్శించుకున్నారని మంత్రి తెలిపారు. సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చినట్లు అంచనా వేశారు. మరో ఒకటి రెండు రోజుల్లో తిరుగు జాతర జరుగుతుందని చెప్పారు. వచ్చే జాతర నాటికి మేడారం చుట్టుపక్కల రోడ్లను వెడల్పు చేసి ట్రాఫిక్ సమస్యలు నివారిస్తామని, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ములుగు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!